జిల్లాలో 32 ఏసీబీ కేసులు
● డీఎస్పీ విజయ్‌కుమార్
కరీంనగర్‌క్రైం: అవినీతి నిర్మూళనకు ప్రతి పౌరు డు పాటుపడాల ని ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ సూచించారు. నగరంలోని ఏసీబీ కార్యాలయంలో మాట్లాడుతూ.. డిసెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. లంచం ఇవ్వడంతో పాటు తీసుకోవడం నేరమని అన్నారు. లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూ ఆర్‌కోడ్‌ను విడుదల చేసిందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది 32 కేసులు నమోదు చేసి, రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచామన్నారు. లంచం అడిగే అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.
కరీంనగర్‌కల్చరల్: ధర్మాదాయ, దేవాదాయశాఖకు చెందిన సీసీఎల్ భూముల రిజిస్ట్రేషన్ పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ జోన్ ఉపకమిషనర్ సునీత సూచించారు. శుక్రవార ఉమ్మడి జిల్లా దేవాదాయ కమిషనర్ కార్యాలయం సమావేశం అయ్యారు. సీసీఎల్‌ఏ భూ ములు రిజిస్ట్రేషన్ చేసే ముందు పూర్వ రికార్డులైన కాస్ర, సేతువర్, చేన్ల వివరాలు సేకరించి, సర్వే నంబర్లు ధ్రువీకరణ చేయాలన్నారు. వివరాలను 22–ఏ(ఐ)సీ ప్రొఫార్మలో నమోదు చేసి రికార్డులు రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా సహా య కమిషనర్ నాయిని సుప్రియ పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): ఆరోగ్యకరమైన నేలలతోనే చక్కని దిగుబడి వస్తుందని డీఏవో భాగ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ మృత్తిక (నేల) దినో త్సవం సందర్భంగా శుక్రవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో చింతకుంటలో పంట అవశేషాల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. డీఏవో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో, ఆహా ర భద్రతలో, జీవ వైవిధ్య పరిరక్షణలో నేల కీలక పాత్ర పోషిస్తుందన్నారు. శాస్త్రవేత్త డా. కె.మదన్ మోహన్‌రెడ్డి, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా.హరికృష్ణ, వ్యవసాయ పరిశోధనస్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డా.ఇ.రజనీకాంత్, డా.రాజేంద్ర ప్రసాద్‌లు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, జీవన ఎరువులు వాడాలని, నేల ఆరోగ్యమే మనుషుల ఆరోగ్యం అని తద్వారా దేశ ఆరోగ్యం బావుంటుందన్నారు. పంట అవశేషాల యాజమాన్యం, పంట మార్పిడి చేయడం, మల్చింగ్ చేయడం వంటివి చేయాలని రైతులకు సూచించారు.
గన్నేరువరం: రెండేళ్లల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గన్నేరువరంలో సర్పంచ్ అభ్యర్థి సందవేని ప్రశాంత్‌తో పాటు వివిధ పార్టీలకు చెందినవారు బీజేపీలో చేరారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. గ్రామ పంచాయతీలు మొదలుకుని రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. మానేరుపై వంతెన నిర్మాణానికి మంత్రి కృషి చేశారన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు తిప్పర్తి నికేశ్, భార్గవరెడ్డి, సాయిని మల్లేశం, ఏలేటి చంద్రారెడ్డి, సొల్లు అజయ్‌వర్మ, కరివేద మహిపాల్‌రెడ్డి, వి.రామచంద్రం పాల్గొన్నారు.
జిల్లాలో 32 ఏసీబీ కేసులు
జిల్లాలో 32 ఏసీబీ కేసులు
జిల్లాలో 32 ఏసీబీ కేసులు


