ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
హుజూరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలకు పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. హుజూరాబాద్ డివిజన్‌లోని హుజూ రాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్ మండలాల్లోని నామినేషన్, సమస్యాత్మక కేంద్రాలను గురువారం పరిశీలించారు. హు జూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి చిన్నపాపయ్యపల్లి, వీణవంక మండలం చల్లూరు, మామిడాలపల్లి, జమ్మికుంట పరిధిలోని జగ్గయ్యపేట, వల్భాపూర్, ఇల్లందకుంట మండలంలోని నాగంపేట, టేకుర్తితో పాటు పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్ రోజు కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని పలువురు రౌడీషీటర్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి హెచ్చరించారు. ఎన్నికల నియమావళిలో భాగంగా నేర చరిత్ర ఉన్న వారిని బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, సీఐలు కరుణాకర్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ఎస్సైలు ఆవుల తిరుపతి, క్రాంతికుమార్ పాల్గొన్నారు.


