గురి చూసి కొట్టాలి..
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో గురువారం జరిగిన దివ్యాంగుల క్రీడాపోటీల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళ్లు సరిగా కనపడకున్నా పోటాపోటీగా పరిగెత్తారు. చెస్‌లో ఎత్తులు వేశారు. క్యారమ్‌లో స్ట్రైకర్‌ను గురి చూసి కొట్టారు. కలెక్టర్ పమేలా సత్పతి సైతం వారి క్రీడా స్ఫూర్తిని చూసి సంబురపడ్డారు. చెస్, క్యారం, రన్నింగ్, షార్ట్‌పుట్, జావెలిన్‌త్రోలో విజేతలుగా నిలిచినవారికి బంగారు, రజత, కాంస్య పతకాలు ప్రదానం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధి శివ కాంత్, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి పాల్గొన్నారు.


