నవజాత శిశువు మరణాలు తగ్గించాలి
కరీంనగర్: నవజాత శిశువుల మరణాల రేటును తగించడమే లక్ష్యంగా విధి విధానాలు రూపొందించుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణప్రసాద్, పీడియాట్రిక్ వైద్యులతో గురువారం సంకల్ప్ జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ ఈ కమిటీ నవజాత శిశువుల మరణాల రేటును తగ్గించడం కోసం దృష్టి పెట్టాలని సూచించారు.
నిలకడగా పత్తి ధరలు
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో పత్తి ధర నిలకడగా కొనసాగుతోంది. గురువారం మార్కెట్‌కు 56 వాహనాల్లో 462 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. గరిష్ట ధర రూ.7,250, మోడల్ ధర రూ.6,950, కనిష్ట ధర రూ.6,250కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
నేటి నుంచి ‘వేసెక్టమీ’ క్యాంపు
కరీంనగర్: ఈనెల 28 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వేసెక్టమీ ఆపరేషన్ల క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్ వెంకటరమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వేసెక్టమీ అవగాహన శస్త్ర చికిత్సల పక్షోత్సవాలు నిర్వహిస్తోందని వెల్లడించారు. పురుషులకు కోత, కుట్టులేని కుటుంబ నియంత్రణ ఆ పరేషన్ ఐదు నిమిషాల్లో చేయబడుతుందని వెల్లడించారు. జిల్లాలోని జిల్లా ప్రభుత్వ ఆసుప త్రి, హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంట ఆస్పత్రిలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన పురుషులు ముందుకు వచ్చి కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాలు విజయవంతం చేయాలని కోరారు.
5వ సెమిస్టర్‌కు 2,497 మంది హాజరు
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ 5వ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. 2,619 మంది విద్యార్థులకు 2,497 మంది హాజరయ్యారు. 118 మంది గైర్హాజరయ్యారు. నలుగురు మాల్ ప్రాక్టీస్‌లో పట్టుపడినట్లు శాతవాహన యూని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేశ్ కుమార్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ 3వ సెమిస్టర్ పరీక్షలకు 10,991 మందికి 10,579 మంది విద్యార్థులు హాజరయ్యారు. 410 మంది గైర్హాజరయ్యారు. ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌లో పట్టుపడ్డారు.
నవజాత శిశువు మరణాలు తగ్గించాలి


