వినతులే వినతులు | - | Sakshi
Sakshi News home page

వినతులే వినతులు

Nov 11 2025 5:47 AM | Updated on Nov 11 2025 5:47 AM

వినతు

వినతులే వినతులు

● ప్రజావాణికి 339 దరఖాస్తులు ● పరిష్కరించాలని వేడుకోలు దర్జాగా కబ్జా చేసే ప్రయత్నం మోటార్లను తొలగించండి ఇరుకు దారిని సౌకర్యంగా మార్చండి కాలనీయే నాదంటుండు

కరీంనగర్‌ అర్బన్‌: కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి వినతుల తాకిడి పెరుగుతుంది. వివిధ రకాల సమస్యలతో ప్రజావాణిని ఆశ్రయిస్తుండగా పరిష్కారం అంతంత మాత్రమే. ప్రధానంగా భూసమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాల కోసం అర్జీలు అందజేశారు. కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్లు అశ్విని తానాజీవాకడే, లక్ష్మీ కిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 339 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌ వివరించారు.

గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 513లో మా తాత నర్సింగం 1974లో 6.18 ఎకరాలు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి తాత, నాన్న, ఇప్పుడు మాకు ఆ భూమే ఆధారం. రెండేళ్ల నుంచి ఆ భూమి మాదంటూ కబ్జాచేసేందుకు కొంత మంది వ్యక్తులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉన్నతాధికారుల వద్ద హియరింగ్‌ జరగగా సదరు వ్యక్తులు ఎలాంటి ఆధారాలు చూపకపోగా అరాచకాలకు పాల్పడుతున్నారు. కలెక్టర్‌ చొరవ చూపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. సాగుకు ఆటంకం లేకుండా చూడాలి. – శ్రీగిరిరాజు, సోదరులు, జూగుండ్ల, తిమ్మాపూర్‌ మండలం

మత్స్యకారులకు చెరువులే ఆధారం. చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్నాం. కానీ... కొందరు రైతులు రాగంపేట, రెవల్లె పెద్ద చెరువులో మోటార్లను పెడుతూ నీటిని తోడేస్తున్నారు. దీంతో చేప పిల్లల ఎదుగుదల నిలిచిపోతోంది. – మత్స్యకారులు, రాగంపేట,

చొప్పదండి మండలం

స్మార్ట్‌ సిటీలో బొమ్మకల్‌ను కలిపారు. కానీ.. ధర్మానగర్‌ కాలనీకి రవాణా సౌకర్యం లేదు. ఇరుకు దారితో ఇబ్బందులు పడుతున్నాం. తోవలో భారీ చింతచెట్లు ఉండగా దారికి సంకటంగా మారాయి.–ధర్మానగర్‌ కాలనీవాసులు,

బొమ్మకల్‌, కరీంనగర్‌

గ్రామంలోని 566 సర్వే నంబర్‌లో ప్లాట్లను కొనుగోలు చేసి 82 ఏళ్ల క్రితం ఇండ్లను నిర్మించుకున్నాం. వంద కుటుంబాలు తాతల కాలం నుంచి పన్నులు చెల్లిస్తున్నాం. తీరా భూభారతిలో పేరును ఆసరా చేసుకుని వారసుడిని అంటూ నోటీసులు పంపిస్తున్నారు. గతంలో ఓవ్యక్తి తాను వారసుడినంటూ చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఇపుడు మరొకరు.. ఇలాగైతే మా పరిస్థితి ఎలా.. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి. – విజయనగరం కాలనీవాసులు, గర్శకుర్తి, గంగాధర

మొత్తం అర్జీలు: 339

ఎక్కువగా మున్సిపల్‌ కార్పొరేషన్‌: 68

హౌసింగ్‌: 43

వినతులే వినతులు1
1/4

వినతులే వినతులు

వినతులే వినతులు2
2/4

వినతులే వినతులు

వినతులే వినతులు3
3/4

వినతులే వినతులు

వినతులే వినతులు4
4/4

వినతులే వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement