బిల్లు కట్టినా బకాయి నోటీసు! | - | Sakshi
Sakshi News home page

బిల్లు కట్టినా బకాయి నోటీసు!

Nov 11 2025 5:47 AM | Updated on Nov 11 2025 5:47 AM

బిల్లు కట్టినా బకాయి నోటీసు!

బిల్లు కట్టినా బకాయి నోటీసు!

బిల్లు కట్టినా బకాయి నోటీసు! ● రికార్డులు లేక పరేషాన్‌ ● నల్లాల స్పెషల్‌ డ్రైవ్‌లో గందరగోళం

● రికార్డులు లేక పరేషాన్‌ ● నల్లాల స్పెషల్‌ డ్రైవ్‌లో గందరగోళం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ సిటీలో నల్లా కనెక్షన్‌ల వ్యవస్థను గాడినపెట్టేందుకు ఇటీవల చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో సిబ్బంది నిర్వాకంతో గందరగోళం నెలకొంది. నల్లా కనెక్షన్‌లు ఆన్‌లైన్‌ చేయడం, అక్రమ నల్లాలను గుర్తించి క్రమబద్ధీకరించడం, తొలగించడం, రెసిడెన్షియల్‌ పేరిట కమర్షియల్‌ కనెక్షన్‌ తీసుకోవడం లాంటి వాటిని సరిచేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. కానీ.. కొంతమంది ఉద్యోగుల కారణంగా ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్‌లో బిల్లులు బకాయి చూపిస్తున్నాయంటూ, గృహ యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. తాము సంవత్సరాలుగా నల్లా బిల్లులు చెల్లిస్తున్నా, బకాయి పడ్డట్టు నోటీసులు ఎలా జారీ చేస్తారంటూ బాధితులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. మారుతీనగర్‌లో ఒకరికి బదులు మరొకరికి నోటీసు ఇచ్చారు. ఇలా నగరంలోని వివిధ డివిజన్లలో నోటీసులు అందుకున్న చాలామంది సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చారు. గతంలో నల్లా బిల్లులు చెల్లించిన రసీదులను చూపిస్తూ, తమకు బకాయి నోటీసులు ఎలా ఇస్తారంటూ నల్లా విభాగ ఉద్యోగులను నిలదీశారు. తాము కొత్తగా వచ్చామంటూ అధికారుల వద్దకు పంపించారు. అక్కడికెళ్లిన బాధితులకు సదరు అధికారి నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. నోటీసుల బా ధ్యులు ఒకరంటే మరొకరంటూ బాధితుల వద్ద తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వివాదాన్ని మరింత గందరగోళం వైపు నెడుతున్నారు.

రికార్డులు ఎక్కడ..?

నల్లా బిల్లుల బకాయిలు పూర్తిగా వసూలు చే సేందుకు చేస్తున్న ప్రయత్నం బెడిసికొడుతోంది. ఆన్‌లైన్‌ ప్రక్రియ సక్రమంగా లేకపోవడంతో చాలా సంవత్సరాల నుంచి వివరాలు నమోదు కావడం లేదు. ఇప్పటికే ఆన్‌లైన్‌ చేయాల్సిన నల్లా కనెక్షన్‌ల దరఖాస్తులు వందలాదిగా కార్యాలయంలో పేరుకుపోయాయి. నల్లా బిల్లులు కడుతున్నా, ఆ వివరాలు మాన్యువల్‌గా, ఆన్‌లైన్‌లో ఎక్కడా లేకపోవడం సమస్యగా మారింది. నల్లాల రికార్డుల నిర్వహణలో లోపం ప్రస్తుతం సమస్యను మరింత జఠిలం చేస్తోంది.

రసీదులు లేకపోతే ఎలా...

నల్లా బకాయిల వసూళ్లలో భాగంగా గృహయజమానులకు నీటి పన్ను డిమాండ్‌ పేరిట నోటీసులు ఇస్తున్నారు. నగరంలోని పలు డివిజన్‌లలో సంబంధిత వార్డు అధికారులు ఈ నోటీసులు అందచేస్తున్నారు. కాని నల్లా బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించిన వారికి కూడా నోటీసులు ఇవ్వడం గందరగోళానికి కారణమైంది. దీనితో బాధితులంతా నగరపాలకసంస్థకార్యాలయానికి వచ్చి, తమ రశీదులు చూపిస్తున్నారు. ఒకవేళ గతంలో నల్లా బిల్లు చెల్లించి ర శీదు లేకపోతే పరిస్థితి ఏమిటంటూ బాధితులు సంధిస్తున్న ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఇప్పటికై నా నగరపాలకసంస్థఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ గందరగోళానికి తెరదించాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్‌

కరీంనగర్‌ అర్బన్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా ఉండేలా చూసుకోవాలని, నిర్లక్ష్యంచేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 325 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. టార్ఫాలిన్‌ కవర్లు, గన్నీ బ్యాగులు, తాగునీరు, తేమచూసే యంత్రం అందుబాటులో ఉంచాలన్నారు. ఒకవేళ వర్షాలు కురిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఎం.రజనీకాంత్‌, డీఎస్‌వో నర్సింగరావు, డీఏవో భాగ్యలక్ష్మి, డీఆర్డీవో శ్రీధర్‌, జిల్లా సహకార అధికారి రామానుజచార్యులు పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.6,900

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్‌ పత్తి రూ. 6,900 పలికింది. క్రయ విక్రయాలను మార్కె ట్‌ చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్నసదానందం, మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement