ధాన్యం డబ్బులు ఇయ్యాలె | - | Sakshi
Sakshi News home page

ధాన్యం డబ్బులు ఇయ్యాలె

Nov 11 2025 5:47 AM | Updated on Nov 11 2025 5:47 AM

ధాన్యం డబ్బులు ఇయ్యాలె

ధాన్యం డబ్బులు ఇయ్యాలె

ధాన్యం డబ్బులు ఇవ్వాలంటూ శంకరపట్నం మండలం కేశవపట్నం పాటూరి సీడ్‌ప్లాంట్‌ ఎదుట రైతులు ఆందోళన చేశారు. యాసంగిలో వీణవంక, సుల్తానాబాద్‌, జనగాం, సిద్దిపేట జిల్లాలో పాటూరిసీడ్‌కు చెందిన హైబ్రీడ్‌ వరి, మొక్కజొన్న 300 ఎకరాల్లో సాగుచేశారు. ఏప్రిల్‌లో ధాన్యం తూకంవేసి అప్పగించారు. అప్పుడు రూ.1.26 కోట్లు కంపెనీ యాజమాన్యం ఇచ్చింది. మరో రూ. 70 లక్షలు రావాల్సి ఉంది. బకాయి డబ్బులు ఇవ్వమంటే రేపు.. మాపంటూ యాజమాన్యం దాటవేయడంతో రైతులు సోమవారం ప్లాంట్‌ ఎదుట వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్లాంట్‌ యజమాని డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఒత్తిడి చేస్తున్నారని ఆర్గనేజర్‌ మహిపాల్‌రెడ్డి ఆరోపించారు.

– శంకరపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement