వందశాతం పన్నులు వసూలు చేయాలి
కరీంనగర్‌రూరల్: గ్రామపంచాయతీల్లో వందశాతం పన్ను వసూలు చేసేందుకు కార్యదర్శులు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ అన్నారు. గురువారం కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామాన్ని డీపీవో సందర్శించారు. గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు. పారిశుధ్యం, కంపోస్టుషెడ్డు, నర్సరీ, ప్లాంటేషన్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్స్, ప్లాంటేషన్ వాచర్లకు టిఫిన్‌బాక్స్‌లు పంపిణీ చేశారు. ఎంపీడీవో సంజీవరావు, ఎంపీవో జగన్మోహన్‌రెడ్డి, డీపీఎం ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌రావు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు పాల్గొన్నారు.


