విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
మానకొండూర్/కరీంనగర్ టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూరు మండలం దేవంపల్లి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 11వ జోనల్‌స్థాయి స్పోర్ట్స్ మీట్–2025 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, స్పోర్ట్స్‌మీట్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరుగాంచాలన్నారు. సీఐలు శ్రీను, సంజీవ్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో వరలక్ష్మీ, ప్రిన్సిపాల్ జగన్నాథం, వైస్ ప్రిన్సిపాల్ కొమురయ్య, రేణుక పాల్గొన్నారు.
స్నేహిత ద్వారా భరోసా కల్పించాలి
స్నేహిత ద్వారా జిల్లాలోని ప్రతి పాఠశాలలో బాలబాలికల చట్టాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని కళాభారతిలో గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్నేహిత రెండోవిడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాలబాలికలకు రక్షణ, భద్రతపై అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు వ్యవసాయ, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, మెప్మా, పంచాయతీ అధికారులతో ప్రతి మండలానికి ఒక బృందం ఏర్పాటు చేసినట్లు తె లిపారు. ఈ బృందాలు ప్రతి మంగళవారం రెండు పాఠశాలలను సందర్శిస్తాయన్నారు. అనంతరం స్నేహిత పోస్టర్ ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వ తి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, మెప్మా పీడీ స్వ రూపారాణి, షీటీం సీఐ శ్రీలత పాల్గొన్నారు.


