పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: కరీంనగర్‌లో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, మధ్య స్తంభాల ఏర్పాటు పనులు కొనసాగుతున్నందున శుక్రవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు 11 కె.వీ.సివిల్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలోని రామాలయం, జానకి చికెన్ సెంటర్, సివిల్ ఆసుపత్రి ముందు ప్రాంతంతో పాటు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.గోదాంగడ్డ ఫీడర్‌పరిధిలోని శ్రీనగర్ కాలనీ, అంజనాద్రి దేవాలయం, దోబీఘాట్, గోదాంగడ్డ, బిఎస్‌ఎఫ్ క్వార్టర్స్, జడ్పీ క్వార్టర్స్, భగత్‌నగర్, మల్లమ్మ మార్కెట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1,2, ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.


