పారిశుధ్య పనులు మెరుగ్గా చేయాలి | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య పనులు మెరుగ్గా చేయాలి

Nov 7 2025 7:23 AM | Updated on Nov 7 2025 7:23 AM

పారిశ

పారిశుధ్య పనులు మెరుగ్గా చేయాలి

పారిశుధ్య పనులు మెరుగ్గా చేయాలి రైతులకు సేవలు.. సంఘానికి అభివృద్ధి ఎకరాకు రూ.25వేల పరిహారమివ్వాలి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఆదేశించారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటన నేపథ్యంలో గురువారం పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. గవర్నర్‌ వెళ్లే రూటు మ్యాప్‌ ప్రకారం నగరంలోని అలుగునూరు, ఎన్‌టీఆర్‌ జంక్షన్‌, బద్దం ఎల్లారెడ్డి జంక్షన్‌, కమాన్‌చౌరస్తా, వన్‌టౌన్‌ జంక్షన్‌, బస్‌స్టేషన్‌, ప్రతిమచౌరస్తా, తెలంగాణ చౌక్‌, రాంనగర్‌, చింతకుంట జంక్షన్‌ నుంచి శాతావాహన యూనివర్సిటీ వరకు పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. అనంతరం కలెకరేట్‌ ఆవరణలో పారిశుధ్య పనులతో పాటు సీసీ రోడ్డు పనులు పరిశీలించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనపడకుండా చర్యలు తీసుకోవాలని సూ చించారు. రహదారుల వెంట డివైడర్ల పక్కన ఇసుక, మట్టి ఉండకుండా శుభ్రం చేయాలన్నారు. శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ శ్యామ్‌ రాజ్‌, డీఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

చొప్పదండి: రైతుల శ్రేయస్సే లక్ష్యంగా సహకార సంఘాలు పని చేస్తున్నాయని జాతీయ ఉత్తమ పీఏసీఎస్‌ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్‌ జాతీయ ఉత్తమ అవార్డును మూడు సార్లు సాధించడంతో మహారాష్ట్రలోని పూణె పట్టణానికి చెందిన పీజీడీఎం కోర్సు చదువుతున్న 25 మంది విద్యార్థుల బృందం గురువారం సందర్శించింది. చొప్పదండి సహకార సంఘం అందిస్తున్న సేవలు, అభివృద్ధి విధానం, జాతీయ ఉత్తమ అవార్డును పొందడానికి దోహదపడిన అంశాలను పరిశీలించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణాలు అందించడానికే సహకార సంఘాలు ఏర్పడ్డాయని, కాలక్రమంలో రైతులకు ఎరువులు, ఫర్టిలైజర్స్‌, విత్తనాలు, పురు గు మందులు, పంపిణీ, మార్కెటింగ్‌, మద్ద తు, ఇతర సేవలకు విస్తరించడంతోనే దేశంలో ని 96 వేల సంఘాలలో తమ సంఘం ఉత్తమ సంఘంగా నిలిచిందని తెలిపారు. జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు, వైస్‌ చైర్మన్‌ ముద్దం మహేశ్‌గౌడ్‌, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్‌టౌన్‌: మోంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో డీఆర్‌వోకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడు తూ.. వారం క్రితం కురిసిన వర్షంతో చొప్పదండి నియోజకవర్గంలో వేలఎకరాల్లో వరిపంట దెబ్బతిందన్నారు. జిల్లా అధికారులు పరిశీలన చేసి, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. పత్తి రంగు మారినా, మ్యాచర్‌తో సంబంధం లేకుండా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలన్నారు.

కరీంనగర్‌రూరల్‌: కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలని జిల్లా సహకార అధికారి రామానుజచార్యులు సూ చించారు. కరీంనగర్‌ మండలం నగునూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైసుమిల్లులకు తరలించాలని తెలిపారు. నాలుగు ఎకరాలున్న రైతులు పామాయిల్‌ సాగు చేసినట్లయితే అధిక లాభాలను గడించే అవకాశముందని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ సొసైటీ డైరెక్టర్‌ సాయిల్ల మహేందర్‌, సెంటర్‌ ఇన్‌చార్జి అజయ్‌ పాల్గొన్నారు.

పారిశుధ్య పనులు   మెరుగ్గా చేయాలి
1
1/2

పారిశుధ్య పనులు మెరుగ్గా చేయాలి

పారిశుధ్య పనులు   మెరుగ్గా చేయాలి
2
2/2

పారిశుధ్య పనులు మెరుగ్గా చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement