తడారని పొలం.. కోతల భారం
ఈ చిత్రంలో నేలవాలిన వరిపంటను ట్రాక్ మిషన్‌తో కోస్తున్న పొలం జిల్లాలోని వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన సిలివేరు వెంకటయ్యది. మూడెకరాల్లో వరి సాగుచేయగా పైరు చేతికొచ్చే సమయంలో అకాల వర్షం నిండా ముంచింది. పంటమొత్తం నేలవాలడంతో పచ్చిపొలాన్నే ట్రాక్‌మిషన్‌తో కోయించాడు. ఎకరాకు రెండు గంటల చొప్పున ఆరు గంటల సమయం పట్టింది. ట్రాక్‌మిషన్ కిరాయి గంటకు రూ.3వేల చొప్పున రూ.18వేలయ్యింది. వర్షం లేకపోతే హార్వెస్టర్‌తో కోయిస్తే రూ.8వేల లోపు అయ్యేదని రైతు తెలిపాడు. వరి నేలకొరగడంతో 30శాతం ధాన్యం రాలిపోయిందని, పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వెంటకయ్య వాపోయాడు.


