జింకను వేటాడిన వ్యక్తి అరెస్ట్
కొడిమ్యాల: వన్యప్రాణిని వేటాడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొడిమ్యాల రేంజ్ అటవీశాఖ అధికారులు తెలిపారు. మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గుడికందుల ఆశయ్య కొద్దిరోజుల క్రితం జింకను వేటాడి చంపాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు జింకను వేటాడిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ అధికారి గులాం మొహినుద్దీన్, డిప్యూటీ రేంజర్ ముషీరుద్దీన్, బీట్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, సిబ్బంది ఉన్నారు.


