రోడ్డుకు తాకిన స్టాండ్‌రాడ్.. స్కూటీకి మంటలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని తెలంగాణతల్లి చౌరస్తా వద్ద సోమవారం ఓ స్కూటీకి మంటలు అంటుకుంటున్నాయి. దుబ్బాక వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వస్తూ కొత్త బస్టాండ్ వైపు మళ్లారు. ఆ క్రమంలో వారి స్కూటీ స్టాండ్ రాడ్ బయటకు ఉండడంతో రోడ్డును తాకి ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో స్కూటీకి మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల వారు హెచ్చరించడంతో బైక్‌పై ఉన్న వ్యక్తులు వాహనాన్ని వదిలి కిందకు దూకారు. స్కూటీపై నీల్లు చల్లడంతో మంటలు ఆరిపోయాయి. తృటిలో ప్రాణపాయం తప్పిందని స్కూటీపై వున్న వారు పేర్కొన్నారు.


