మహిళ బలవన్మరణం
కొత్తపల్లి(కరీంనగర్): మతిస్థిమితం లేని మహిళ చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ పడి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో బిల్ల కోటేశ్వర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఉయ్యాల రాజశేఖర్ తన తల్లి, కుటుంబంతో కలిసి చింతకుంటలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు, అయితే తండ్రి 11 ఏళ్ల కిందట మృతి చెందగా తల్లి ఉయ్యాల అరుణ(53) మానసికంగా ఇబ్బంది పడుతూ రాత్రి వేళల్లో లేచి తిరుగుతుండటాన్ని గమనించి వారు ఇంటికి తీసుకొచ్చేవారు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో లేకపోవడాన్ని గమనించి చుట్టు పక్కల ఆరా తీయగా చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్‌లో శవమై తేలింది. ఆరోగ్యం క్షీణించి మతిస్థిమితం లేక జీవితంపై విరక్తి చెంది కెనాల్‌లో పడి తల్లి అరుణ ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు రాజశేఖర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
కడుపునొప్పి భరించలేక యువకుడు..
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన పిట్టల మహేశ్(23) కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన మహేశ్ మడకలో స్థిరపడ్డాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి భరించలేక జీవితంపై విరక్తిచెంది ఆదివారం రాత్రి పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువికరించారు. మృతుడి తండ్రి పిట్టల వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు.


