వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు అండగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కావ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్‌లోని వీకన్వెన్షన్‌లో ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడుతూ డాక్టర్లు పేషెంట్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తారని, కొన్ని సందర్భాలలో పరిస్థితి విషమించి చనిపోతే వైద్యులను బాధ్యులను చేస్తూ ఆసుపత్రులపై దాడులకు పాల్పడడం బాధాకరమన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడు తూ కరీంనగర్ మెడికల్ హబ్‌గా అభివృద్ధి చెందిందన్నారు. ఐఎంఏ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పి.కిషన్, కార్యదర్శిగా వి.అశోక్, కోశాధికారిగా దయాల్ సింగ్, ఉపాధ్యక్షులుగా విజయరావు, ఎంఎల్‌ఎన్ రెడ్డి, బి.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిలుగా టీవీ.శ్రీనివాస్, ఆర్.సునీత, పి.శరత్‌చంద్ర, రామకృష్ణ, రూపులాల్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు సైంటిఫిక్ సెషన్స్ నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్.రావు పాల్గొన్నారు.


