పురుడు పోసిన 108 సిబ్బంది
రామగిరి(మంథని): పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి ఇంటికి వెళ్లి 108 సిబ్బంది పురుడు పోశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గోవిందుల మౌనిక(28)కు పురిటి నొప్పులు మొదలవ్వగా.. 108కి ఫోన్ చేశారు. 108 మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివా స్, పైలెట్ మామిడి సంపత్ 108 వాహనంతో బేగంపేట బయలుదేరారు. మౌనికకు పురిటి నొప్పులు తీవ్రం కాగా.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమందించారు. గర్భిణిని దవాఖానకు తీసుకెళ్లేందుకు సమయం లేక ఇంట్లోనే పురుడు పోయగా.. పండంటి ఆడ శిశువు జన్మించింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండగా.. వారిని వైద్య పరీక్షల కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


