ఆర్టీసీ బస్సు ఢీ.. ఒకరి దుర్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామ పంచాయతీ శివారులోని కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారిపై హెచ్‌ిపీ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఎస్సై రాహుల్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన జాలపెల్లి అంజయ్య(38) పెయింటర్ పని చేస్తున్నాడు. సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోడానికి వెళ్తుండగా.. కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారిపై నిజామాబాద్ డిపోకు చెందిన బస్సు బైక్‌ను ఢీకొంది. బైక్‌పై వెళ్తున్న అంజయ్య అక్కడికక్కడే మరణించాడు. అతడికి 8 నెలల క్రితమే సుష్మిత అనే యువతితో వివాహమయింది. ఘటనా స్థలానికి ఎస్‌ఐ రాహుల్‌రెడ్డి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు.


