చికిత్స పొందుతూ కూలీ మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని కనుకదుర్గా రైస్‌మిల్‌లో బాయిలర్ పేలిన ఘటనలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన గంగరపు కుమార్(55) అనే రైస్‌మిల్ కూలీ గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరాల ప్రకారం.. గతనెల 29న రైస్‌మిల్‌లో బాయిలర్ పేలగా.. అక్కడే పని చేస్తున్న కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు
ధర్మపురి: పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం పిచ్చి కుక్క గ్రామానికి చెందిన బిసగోని చంద్రయ్య, మొగలిపాక చంద్రయ్య, బొండ్ల లక్ష్మణ్‌ను గాయపర్చగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బిసగోని చంద్రయ్యకు తీవ్ర గాయాలు కాగా.. అతన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కను గ్రామస్తులు హతమార్చారు.
కార్మిక నేతలపై కేసు
ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఎరువుల కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత నెలలో 2 రోజులపాటు కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ యూనియన్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో ఆర్‌ఎఫ్‌సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్, నాయకులు బండారి శ్రీనివాస్, కుమార్ ఉదయ్ కార్మికులను దుర్భాషలాడుతూ, దూషిస్తూ వాయిస్ పోస్ట్ చేశారు. చంపుతామని బెదిరించారని విక్రమ్‌రెడ్డి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంబటి నరేశ్, బండారి శ్రీనివాస్, కుమార్ ఉదయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై టి.ఉదయ్‌కిరణ్ తెలిపారు.
పెద్దూరులో
ఆన్‌లైన్ బెట్టింగ్ కలకలం
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరు గ్రామంలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా దందా కలకలం రేపింది. స్థానిక యువకుడు ప్రణయ్‌ను ఆన్‌లైన్ బెట్టింగ్ పేరుతో ముఠా సభ్యులు ఉచ్చులోకి లాగి క్రమంగా అతడి కుటుంబ సభ్యుల నుంచి సుమారు రూ.40లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. బెట్టింగ్ ముఠా బెదిరింపులకు భయపడి యువకుడు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. యువకుడిని కాపాడుకునేందుకు కుటుంబీకులు ఇంట్లో ఉన్న బంగారం అమ్మి అప్పులు చేసి ముఠాకు డబ్బులు అప్పగించినా.. వేధింపులు మాత్రం తగ్గలేదని విశ్వనీయంగా తెలిసింది. ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. కొన్నాళ్లుగా వేధింపులు తాళలేక చివరికి కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యకు సిద్ధమైందని, చివరి క్షణంలో స్థానికుల సహాయంతో వారిని కాపాడినట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు.
చికిత్స పొందుతూ కూలీ మృతి


