స్కాలర్‌షిప్ టెస్ట్‌కు స్పందన
కరీంనగర్: కరీంనగర్‌లోని శ్రీచైతన్య ఇంటర్మీడియేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం పదోతరగతి విద్యార్థులకు నిర్వహించిన స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్–25కు విశేష స్పందన లభించినట్లు ఆ విద్యాసంస్ధల చైర్మన్ రమేశ్‌రెడ్డి తెలిపారు. 12వేలకు పైగా విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. ప్రతిభ, ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఉచిత, రాయితీలతో కూడిన విద్యను ఐఐటీ, జేఈఈ మెయిన్స్, నీట్, ఎప్‌సెట్ శిక్షణతో ఇంటర్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ టెస్ట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు కూపన్లు అందించి లక్కీడిప్ నిర్వహించి విజేతలకు బహుమతులందజేశారు. డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు, ఏజీఎం తదితరులు పాల్గొన్నారు.
కిరాణ దుకాణంలో దొంగతనం
మేడిపల్లి(జగిత్యాల): మండల కేంద్రంలో ఎండీ కమరోద్దీన్‌కు చెందిన కిరాణం దుకాణంలో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. నగదుతోపాటు రూ.20వేల విలువ గల కిరాణ సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. రోజూలాగే ఉదయం వెళ్లి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయని, కౌంటర్‌లో ఉన్న నగదుతోపాటు సామగ్రి కనబడలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
స్కాలర్‌షిప్ టెస్ట్‌కు స్పందన


