విఘ్నేశ్‌ను కాపాడాలి
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి
ముస్తాబాద్(సిరిసిల్ల): అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బాధితుల కథనం ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన గడప మాధవి–బాలకిషన్ దంపతుల కుమారుడు విఘ్నేశ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన విఘ్నేశ్‌ను ఆసుపత్రిలో చూపించగా.. కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా.. రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు పేర్కొన్నారని వాపోయారు. మానవతావాదులు స్పందించి ఆదుకోవాలని, 9133934308 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
●


