ప్రమాదవశాత్తు బొలెరో దగ్ధం
జగిత్యాలక్రైం: కోరుట్ల మండలం మోహన్‌రావుపేట గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిలిపి ఉన్న మహేంద్ర బొలెరో వాహనం దగ్ధమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ ఆసిఫ్ శనివారం రాత్రి నిజామాబాద్‌లో తన బొలెరో వాహనంలో సుమారు రూ.లక్ష విలువైన ఉల్లిగడ్డలు తీసుకొని కరీంనగర్‌కు వస్తూ ఆదివారం తెల్లవారుజామున మోహన్‌రావుపేట శివారులోని పెట్రోల్ బంక్ వద్ద నిలిపి నిద్రిస్తుండగా.. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అక్కడున్నవారు కేకలు వేయడంతో మహ్మద్ ఆసిఫ్ బయటకొచ్చాడు. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారమందించగా.. జగిత్యాల అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకొని పెట్రోల్ బంక్ వైపు మంటలు వ్యాపించకుండా కెమికల్ ఫోమ్‌తో మంటలార్పారు. 3 నెలల క్రితమే కొత్తగా కొనుగోలు చేసిన రూ.10లక్షల విలువైన వాహనంతోపాటు రూ.లక్ష విలువైన ఉల్లిగడ్డలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎస్‌ఎఫ్‌వో కృష్ణకాంత్, సిబ్బంది మల్లేశం, ప్రణయ్‌కుమార్, సంతోష్, కార్తీక్, గంగేశ్, రఫీక్ ఉన్నారు.


