లింగ నిర్ధారణ నేరం
హుజూరాబాద్: లింగనిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం బేటి పడావో బేటి బచావో కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఆడపిల్లలను ప్రోత్సహించాలన్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ పీసీపీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో చందునాయక్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, డాక్టర్లు ఉమాశ్రీ, మధుకర్ పాల్గొన్నారు.
చిగురుమామిడి: మోంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.పదివేల పరిహా రం తక్షణమే అందించాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చిగురుమామిడి మండలం రేకొండలో దెబ్బతిన్న రోడ్లు, వరి, ఇతర పంటలను శనివారం పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయాలన్నారు. హైలెవల్ బ్రిడ్జిలు మంజూరు చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా తూకం వేయాలన్నారు. కూలిన ఇళ్లకు బదులుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోయిని సర్దార్ వల్లభాయ్‌పటేల్, సింగిల్‌విండో డైరెక్టర్లు చాడ శ్రీధర్‌రెడ్డి, ముద్రకోల రాజయ్య, కొండయ్య పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నిక లపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు. పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని శనివారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంకమ్మతోటలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్‌సాగర్, దుర్గం భోగేశ్, గట్టు ఆకాశ్, రాకేశ్, సందేశ్, సన్నీత్ పాల్గొన్నారు.
తడిసిన ధాన్యం తూకం
కరీంనగర్ అర్బన్: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించడంతో ప్రక్రియ వేగవంతం చేశారు. గతనెల 29న కురిసిన అకాల వర్షానికి రైతాంగం అతలాకుతలమైన విషయం విదితమే. వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిముద్దవగా తీరని నష్టం వాటిల్లింది. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండగా రవాణా సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలో 183 గ్రామాల్లోని 25వేల మంది రైతుల ధాన్యం తడిసిపోగా కొనుగోళ్లు చేస్తున్నారు. రెండు రోజుల్లో 785 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, బాయిల్డ్ రైస్‌మిల్లులకు తరలించారు. 31 మంది రైతులకు సుమారుగా రూ.57లక్షలు వారి ఖాతాలో జమ చేశారు. మిగిలిన రైతులకు ఒకటి రెండు రోజుల్లో డబ్బులు ఖాతాలో జమ చేయడం పూర్తవుతుందని పౌర సరఫరాల సంస్థ డీఎం రజనీకాంత్ వివరించారు.
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుతో పాటు మధ్య స్తంభాలు ఏర్పాటు చేస్తున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కె.వీ.గోదాంగడ్డ ఫీడర్ పరిధిలోని శ్రీనగర్‌కాలనీ, అంజనాద్రి ఆలయం, దోబీఘాట్, గో దాంగడ్డ, బీఎస్‌ఎఫ్, జెడ్పీ క్వార్టర్స్, భగత్‌నగర్, మల్లమ్మ మార్కెట్, గోదాంగడ్డ వెనకభాగం, రఘుపతి రెడ్డి ఆసుపత్రి ప్రాంతాలతో పాటు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ. కమాన్ ఫీడర్ పరిధిలోని షాషామహల్, అమీ ర్‌నగర్, కోతిరాంపూర్, పోచమ్మ ఆలయం, సంఘం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ టౌన్–1,2 ఏడీఈలు ఎం.లావణ్య, పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
లింగ నిర్ధారణ నేరం


