క్లెయిమ్ చేయని ఆస్తులపై అవగాహన కల్పించండి
కరీంనగర్ అర్బన్: దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులు(బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్, మ్యూ చువల్ ఫండ్స్, షేర్లు)ను క్లెయిమ్ చేసుకునేలా ప్రజ లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం బ్యాంకు, బీమా, నియంత్రణ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు అన్ని వివరాలు పూర్తిగా నింపి.. నామినీ వివరాలు రాయాలన్నారు. పలువురు ఉద్యోగ, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించినప్పుడు వివిధ ఆర్థిక సంస్థల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు క్లెయిమ్ చేయకుండా వదిలేశారన్నారు. దీంతో వారి అడ్రస్ , కుటుంబసభ్యుల వివరాలు తెలియక ఖాతాల్లోనే సొమ్ము ఉండిపోయిందన్నారు. ఆధార్, ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని ఆస్తులు రెండు లక్షల కోట్లు ఉందని.. వీటిని అర్హులైన పౌరులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్గమ్ పోర్టల్ ప్రవేశపెట్టిందన్నారు. డిసెంబర్ 31 వరకు కార్యక్రమం కొనసాగుతుందని.. గ్రామాల వారీగా స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలన్నారు. బల్దియా కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, డీజీఎం సోలంకి, ఎస్‌ఎల్ బీసీ చైర్మన్ శ్రీహరి, యూ బీఐ డీజీఎం అపర్ణరెడ్డి, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న టెడ్‌ఎడ్ టాక్స్
సప్తగిరికాలనీ(కరీంనగర్): కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన టెడ్ ఎడ్ టాక్స్ ఆకట్టుకుంది. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో మొండయ్య, పారమిత విద్యాసంస్థల అధి నేత ప్రసాద్ రావు విద్యార్థుల ప్రసంగాలను విన్నా రు. జెడ్పీహెచ్‌ఎస్ చెల్పూర్ విద్యార్థి కె.గణేశ్, టీజీ ఎంఎస్ రుక్మాపూర్ విద్యార్థి ఎండీ అర్ఫా సిద్ధికా, టీజీఎంఎస్ ఎలగందల్ నుంచి కె.సహస్ర, టీజీఎంఎస్ పోచంపల్లి నుంచి కె.సంజనారెడ్డి టెడ్‌టాక్స్‌తో ఆకట్టుకున్నారు. పారమిత విద్యాసంస్థల నుంచి జి.అన్విత, జైత్రిక, శ్రీవిద్య, శృతి మైత్రేయ, వర్ష, సమీక్ష ఆసక్తికరమైన అంశాలను వినిపించారు.


