ఎకరాకు రూ.40వేల పరిహారం ఇవ్వాలి
చొప్పదండి: భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.40వేల నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కోరారు. తుపాన్‌తో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం పెంచాలని చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం నిరసన వ్యక్తం చేసి, తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల వరకు పరిహారంగా చెల్లించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బత్తుల లక్ష్మినారాయణ, చేపూరి సత్యనారాయణ, చిల్ల శ్రవణ్, మొగిలి మహేశ్, బత్తిని ప్రశాంత్, మావురం సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.


