ఎస్‌ఐఆర్‌పై సమీక్ష
కరీంనగర్ అర్బన్: భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల క్రమంలో ఐఖ కార్యక్రమంపై జిల్లా రెవెన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల నేతలతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివి జన్ (ఐఖ) ప్రక్రియ సమర్థవంతంగా సాగడానికి ప్రతి పోలింగ్ స్టేషన్‌కు రాజకీయ పార్టీలు బూత్‌స్థాయి ప్రతినిధులను తప్పనిసరిగా ని యమించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మడుపు మోహ న్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, మి ల్కూరి వాసుదేవరెడ్డి, బర్కత్ ఆలీ, కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.
అభివృద్ధి చేసిన వారికే ఓటు
కరీంనగర్ కార్పొరేషన్: గతంలో అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడిన వారికే ఓటు వేయాలని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును విని యోగించుకోవాలన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ.. సహకార బ్యాంక్ వ్యవస్థలో జిల్లాకు చరిత్ర ఉందన్నారు. అర్బన్ బ్యాంక్‌ను జాతీయ బ్యాంక్‌లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పోటీదారుల్లో ఎక్కువగా కాంగ్రెస్ నాయకులు ఉన్నారని, అందుకే అధికారికంగా ప్యానెల్ ఏర్పాటు చేయలేదన్నారు. వెలిచాల రాజేందర్‌రావు ప్యానెల్ ఆయన వ్యక్తిగతమని, అధికారిక ప్యానెల్ కాదని స్పష్టం చేశారు. రూ.92 కోట్ల డిపాజిట్లు, రూ.50 కోట్ల రుణాలతో నడుస్తున్న అర్బన్ బ్యాంక్‌కు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. శనివారం నాటి పోలింగ్‌లో అనుభవం ఉన్నవారిని గెలిపించాలని కోరారు. చర్ల పద్మ, దండి రవీందర్, బొబ్బిలి విక్టర్, ఎండీ చాంద్, షబానా మహమ్మద్ పాల్గొన్నారు.
సప్తగిరికాలనీ(కరీంనగర్): రాష్ట్రస్థాయి డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్స్ రెండు రోజుల సదస్సులో పాల్గొన్న ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణను కళాశాల విద్యాశాఖ కార్యదర్శి యోగి తారాణా, కమిషనర్ దేవసేన, యోగివేమన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ హైదరాబాద్‌లో సత్కరించారు. ఎస్సారార్ కళాశాలకు న్యాక్ గ్రేడ్ సా ధన, స్వయం ప్రతిపత్తి హోదా సాధన, డిగ్రీలో 97శాతం ప్రవేశాలు సాధించడం, 88శాతం ఫలితాలు సాధించడం, తదితర విషయాలను సదస్సులో రామకృష్ణ క్లుప్తంగా వివరించారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: డీటీఆర్, ఏబీ స్విచ్‌ల పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.వావిలాలపల్లి ఫీడర్ పరిధిలో, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.క్రిష్టియన్‌కాలనీ ఫీడర్ల పరిధిలోని వావిలాలపల్లి, పెట్రోల్‌బంక్, క్రిస్టియన్‌కాలనీ చర్చి, విజయమోహన్‌రెడ్డి ఆసుపత్రి, ఇందిరానగర్, సివిల్ ఆసుపత్రి వెనక భాగం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ నిర్వహణ పనుల నేపథ్యంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ ఫీడర్ పరిధిలోని సీఎంఆర్ రోడ్డు, డీఎఫ్‌వో జంక్షన్, సవరన్ స్ట్రీట్, రాజా థియేటర్, న్యూ అఫెక్స్ ఆసుపత్రి, సివి ల్ ఆసుపత్రి, అటవీశాఖ కార్యాలయం, అంజ త్‌పురా, మంచిర్యాల చౌరస్తా ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ టౌన్– 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
‘నేడు మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం’
కరీంనగర్ అర్బన్: మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని శనివారం ఉదయం 10గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. డిఫ్ అకౌంట్స్ గురించి అవగాహన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కలెక్టర్‌తో పాటు అన్ని బ్యాంకర్లు హాజరవుతారని పేర్కొన్నారు. అన్ని బ్యాంకులు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ క్లైమేట్ డిపాజిట్ల మీద డెఫ్ అకౌంట్ల మీద అవగాహన కల్పిస్తారని, కస్టమర్ల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకుంటారని వివరించారు.
ఎస్‌ఐఆర్‌పై సమీక్ష
ఎస్‌ఐఆర్‌పై సమీక్ష


