సామాజిక తెలంగాణ సాధనకు ఏకం కండి
కరీంనగర్‌టౌన్/తిమ్మాపూర్/హుజూరాబాద్/శంకరపట్నం/రామడుగు/గంగాధర: సామాజిక తెలంగాణ సాధనకు బహుజనులంతా ఏకం కావాలని జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాలో పర్యటించారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. పలువురిని పరామర్శించారు. తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తేమతో సంబంధం లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన గురుకులం విద్యార్థిని శ్రీవర్షిత ఇటీవల ఆత్మహత్య చేసుకోగా విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించారు. గురుకులంలో శ్రీవర్షిత అనుమానాస్పదంగా మృతి చెందటం బాధాకరం అన్నారు. శ్రీవర్షిత మరణంపై ప్రత్యేక ఎంకై ్వరీ సీట్ వేయాలని డిమాండ్ చేశారు. శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టును, కాచాపూర్ శివారులోని నేలకొరిగి న వరిపొలాలను పరిశీలించారు. కల్వల ప్రాజెక్ట్ మరమ్మతుకు గత ప్రభుత్వం రూ.70 కోట్లు మంజూరు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ పనులు చేపట్టడం లేదన్నారు. అక్కడినుంచి కరీంనగర్ చేరుకున్న కవితకు జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించించారు. జాగృతి నేత జాడి శ్రీనివాస్ నివాసంలో మహిళలతో మాట ము చ్చట నిర్వహించారు. అన్ని వర్గాలకు సమన్యా యం జరిగేలా జాగృతి ఆధ్వర్యంలో పోరాటా నికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం రామడుగులోని శిల్పాకళాకారులను కలి సి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంగాధర మండలంలోని కొండన్నపల్లి శివారులో ఉన్న బొమ్మలమ్మ గుట్టను సందర్శించారు. గుట్ట చరిత్రను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గుట్టను గ్రానైట్ వ్యాపారుల నుంచి కాపాడుకోవాలని కోరారు. అనంతరం శివాలయంలో పూజలు చేశారు. జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్, మేకల తిరుపతి, గాలిపెల్లి రత్నాకర్, జంగ అపర్ణ, చంటి శ్రీనివాస్, మంజు భార్గవి, విద్యాసాగర్, లింగచారి, కుమారస్వామి, దెబ్బేటి సూర్య, శోభారాణి, మౌనిక పాల్గొన్నారు.


