ఉత్సాహంగా రన్ ఫర్ యూనిటీ
కరీంనగర్ క్రైం: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం కరీంనగర్ పోలీసుల ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల ‘రన్ ఫర్ యూనిటీ’ పరుగు ఉత్సాహంగా సాగింది. అలుగునూరులో బెలూన్లు వదిలి రన్‌ను ప్రారంభించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ దేశాన్ని సంఘటితం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారన్నారు. ‘రన్ ఫర్ యూనిటీ’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో జాతీయ ఐక్యత పెరుగుతుందన్నారు. అడిషనల్ డీసీపీ భీం రావు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, దాశరథి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్, పోలీసులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.


