కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెంచేందుకే ‘అర్బన్‌’ ఎన్నికల్లో పోటీ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెంచేందుకే ‘అర్బన్‌’ ఎన్నికల్లో పోటీ

Nov 3 2025 6:32 AM | Updated on Nov 3 2025 7:06 AM

నైతికంగా మాదే విజయం.. అనైతిక పొత్తులతో కూటమి ప్యానల్‌ గెలుపు ‘కర్ర’వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా కాంగ్రెస్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌ రావు

కొత్తపల్లి(కరీంనగర్‌): కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెంచేందుకే అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో ప్యానెల్‌ను పోటీలో నిలిపానని, నైతికంగా విజయం తమదేనని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల అనైతిక పొత్తుతో కూటమి ప్యానెల్‌ గెలుపొందిందని పార్టీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌ రావు అభిప్రాయపడ్డారు. కొత్తపల్లిలోని ప్రజా కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ.. తమ ప్యానెల్‌ అభ్యర్థులను అనతికాలంలోనే ఆదరించిన ప్రజలు, గెలుపొందిన డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపా రు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలతో అంటకాగిన కర్ర రాజశేఖర్‌పై అధిష్టానానికి పిర్యాదు చేస్తానని వెల్లడించారు. బ్యాంకు వ్యవహారాల్లో అవినీతి, అక్రమాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గతంలో నకిలీ బంగారంపై లోన్‌ ఇవ్వడం, లోన్లపై కమీషన్లు తీసుకోవడం వంటివి జరిగాయని, వాటిన్నంటిని రూపుమాపేందుకే ప్యానెల్‌ అభ్యర్థులను పోటీలో నిలిపానన్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పా ర్టీ కేడర్‌ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఈ ఎన్నికల బరిలో నిలవడం జరిగిందన్నారు. అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్లుగా గెలుపొందిన ఉయ్యాల ఆనందం, అనరాసు కుమార్‌ను సత్కరించారు. నాయకులు చిందం శ్రీనివాస్‌, తాండ్ర శంకర్‌, ఎంఏ కరీం, కాసార పు కిరణ్‌, గండి గణేశ్‌, అనంతుల రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement