34,127 ఎకరాల్లో పంట నష్టం
● జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి
కరీంనగర్ అర్బన్: భారీవర్షాల క్రమంలో జిల్లాలో 34,127 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. హుజూరాబాద్ మండలంలో 12 గ్రామాల్లో పత్తి 105 ఎకరాలకు నష్టం జరగగా వరి 3,959 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. సైదాపూర్ మండలంలో 324 ఎకరాల్లో పత్తి, 4,123 ఎకరాల్లో వరి, ఇల్లందకుంటలో పత్తి 300, వరి 1200, జమ్మికుంటలో పత్తి 200, వరి 1,400, వీణవంకలో పత్తి 220, వరి 1,650, శంకరపట్నంలో వరి 2,100, మానకొండూరులో పత్తి 300, వరి 3,800, తిమ్మాపూర్‌లో వరి 280, చిగురుమామిడిలో వరి 3,383, గన్నేరువరంలో పత్తి 270, వరి 1,740, కరీంనగర్ రూరల్‌లో పత్తి 593, వరి 2,055, కొత్తపల్లిలో పత్తి 1,200, వరి 2,500, చొప్పదండిలో వరి 550, మొక్కజొన్న 50, రామడుగులో వరి 175, గంగాధరలో వరి 1,650 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వివరించారు.


