 
															అంకితభావమే ఆయుధం
కరీంనగర్ అర్బన్: ఉద్యోగులు, అధికారులు అంకితభావంతో పనిచేయాలని, అదే ప్రభుత్వానికి ఆయుధమని రాష్ట్ర ఆడిట్ సంచాలకుడు మార్తినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. వెంకటేశ్వరరావు బుధవారం జిల్లాకు రాగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికా రు. డిప్యూటీ డైరెక్టర్ (వరంగల్) జనరల్ పోరిక రాము, జిల్లా స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ రాజ్‌కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జామినర్ ఆఫ్ అ కౌంట్స్ రంజిత చికిలే, డిప్యూటీ డైరెక్టర్ వేణు, మాఽ దవరెడ్డి, సుచేత, జోయల్, త్రినాథ్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
