 
															కరీంనగర్‌లో అగ్నిప్రమాదం
కరీంనగర్‌క్రైం: నగరంలోని ప్రధాన మార్కెట్లో ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. వేకువజామున ఒక క్లాత్‌స్టోర్, రెండు ఫొటో స్టూడియోలకు మంటలు అంటుకుని, పెద్దఎత్తున చెలరేగాయి. స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కరీంనగర్, మానకొండూర్‌కు చెందిన సిబ్బంది రెండు ఫైరింజిన్లతో సుమారు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ.50లక్షల వరకు నష్టం జరిగిందని ఫైర్ అధికారులు అంచనా వేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కేసును వన్‌టౌన్‌పోలీసులకు అప్పగిస్తామని డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. కాగా.. ప్రమాదం జరిగిన సమాచారాన్ని ఫైర్‌స్టేషన్‌కు ఆలస్యంగా తెలియజేశారని విచారం వ్యక్తం చేశారు.
రూ.50 లక్షల వరకు నష్టం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
