 
															జగిత్యాల వాసిపై సౌదీలో ‘మత్లూబ్’ కేసు
జగిత్యాలక్రైం: బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్ ‘ఫైనల్ ఎగ్జిట్’ (దేశం వదిలివెళ్లడానికి అనుమతి) లభించక సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో చిక్కుకుపోయాడు. 12వేల సౌదీ రియాళ్లు (రూ.2.80లక్షలు) దొంగతనం జరిగిందని శ్రీనివాస్‌పై కంపెనీ యజమాని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ‘మత్లూబ్’ (వాంటెడ్ బై పోలీస్) కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్‌ను స్వదేశానికి తెప్పించాలని ఆయన కుమారుడు సాయికిరణ్ హైదరాబాద్‌లోని సీఏం ప్రవాసీ ప్రజావాణిలో బుధవారం ఫిర్యాదు చేశాడు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. 2017లో ఆజాద్ వీసాపై సౌదీ వెళ్లిన శ్రీనివాస్ 8 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు. స్వదేశం వచ్చేందుకు అడ్డంకిగా ఉన్న ‘మత్లూబ్’ కేసు తొలగించేందుకు సహకరించాలని అతను రియాద్‌లోని ఇండియన్ ఎంబసీకి ఇదివరకే రెండుసార్లు విజ్ఞప్తి చేశాడు.
స్వదేశం రప్పించాలని సీఎం ప్రవాసీలో ఫిర్యాదు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
