 
															స్వగ్రామానికి చేరిన మృతదేహం
ధర్మపురి: బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ఆయ న మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. ధర్మపురికి చెందిన కొమిరెల్లి నర్సాబోయి (50) కొంతకాలంగా సౌదీ వెళ్తున్నాడు. నెలరోజుల క్రితం పనులు ముగించుకుని గదికి వచ్చిన ఆయన చాతి లో నొప్పిగా ఉందంటూ కుప్పకూలాడు. తోటి కార్మి కులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఇక్కడి కుటుంబసభ్యులకు తెలియనీయకుండా ఇప్పటివరకు గోప్యంగా ఉంచారు. నర్సాబోయి శవమై ఇంటికొస్తున్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
