 
															బల్హార్షా – విజయవాడ మధ్య రైళ్లు రద్దు
రామగుండం: మొంథా తుపాన్ ప్రభుత్వంతో బల్హార్షా – విజయవాడ మధ్య నడిచే కొన్ని రైళ్లను బుధవారం రద్దు చేశారు. భారీవర్షాలతో వరంగల్ జిల్లాలోని డోర్నకల్, గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లలోని ట్రాక్ వరదలో మునిగింది. పలుచోట్ల ట్రాక్‌ల కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో గ్రాండ్‌ట్రంక్ మార్గంలోని రైళ్లను ఆయా స్టేషన్లలోనే నిలిపివేశారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రామగుండం నుంచి రాకపోకలు సాగించే సికింద్రాబాద్–సిర్‌పూర్‌కాగజ్‌నగర్ (17233/34 – భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్)ను బు ధ, గురువారాల్లో రద్దు చేశారు. విశాఖపట్నం – న్యూఢిల్లీ(20834 – ఏపీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్): రీషెడ్యూల్ చేశారు. ఐదు గంటల ఆలస్యంగా నడుస్తుంది.
24 గంటల్లో దొంగల అరెస్ట్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): చోరీ జరిగిన 24 గంటల్లో నే దొంగలను పట్టుకొని.. రిమాండ్‌కు తరలించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని రామచంద్రపురంలో ఇట్టిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈనెల 27న చొరబడ్డ దొంగలు నాలుగు తులాల బంగారం, 28 తు లాల వెండిని ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. 24 గంటల్లోనే దొంగలను పట్టుకున్నారు. అంకుసాపూర్‌కు చెందిన చిన్నవేణి వంశీ, కంది రాహుల్, జిల్లెల్ల కు చెందిన మహమ్మద్ జల్సాలకు అలవాటుప డి సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్ప డుతున్నారు. జిల్లెల్ల చెక్‌పోస్టు వద్ద మరో ఇంట్లో ఈనెల 1న బంగారు ఆభరణాలు, రూ. 10వేలు నగదు దొంగలించారు. ఎస్సై ఉపేంద్రచారి, క్లూస్‌టీం ఎస్సై క్రాంతి, కానిస్టేబుళ్లు న రేందర్, శ్రీకాంత్, అబ్బాస్, శ్రీనివాస్‌లను అభినందించారు. విలేకరుల సమావేశంలో సిరిసిల్ల రూరల్ సీఐ కె.మొగిలి, సిబ్బంది పాల్గొన్నారు.
స్పందిస్తున్న మానవతావాదులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వగ్రామంలో పనులు లేక ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలసకూలి ఎల్లారెడ్డిపేటకు చెందిన బాలమహేందర్ అనారోగ్యంతో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిపాలయ్యాడు. బాధితుడి చికిత్సకు దాతలు ముందుకొస్తున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ‘పతి భిక్ష పెట్టండి’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి మానవతావాదులు స్పందిస్తున్నారు. మూడు నెలలుగా కోమాలోనే ఉండగా.. కంపెనీ యాజమాన్యం దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసి చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. తన భర్తను కాపాడాలని బాలమహేందర్ భార్య సంధ్య కోరడంతో దాతలు ఆర్థికసాయం అందిస్తున్నారు. దాతలు 96400 48582, 95731 18869 నంబర్లలో సాయం చేయాలని బాలమహేందర్ భార్య వేడుకుంటుంది.
 
							బల్హార్షా – విజయవాడ మధ్య రైళ్లు రద్దు
 
							బల్హార్షా – విజయవాడ మధ్య రైళ్లు రద్దు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
