 
															దీపారాధన.. భక్తిభావన
వేములవాడ: కార్తీకమాసం.. ఆధ్యాత్మికతకు నెలవు. దీపారాధన ప్రధానం. మహిళలు ఎక్కువగా పాల్గొనే దీపారాధన వేములవాడ రాజన్న అనుబంధ భీమన్న సన్నిధిలో నిత్యం కనులపండువగా సాగుతోంది. శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు ఈ కార్తీకమాసం మొత్తం వందలాది దీపాలతో ఆలయంలో వివిధ ఆకృతులు పేర్చనున్నారు. దీపాలతో శివలింగం, స్వస్తిక్, ఇతరత్ర ఆకట్టుకునే ముగ్గుల్లో వెలిగించనున్నారు. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుంటున్న మహిళలు సామూహిక దీపారాధనలో పాల్గొంటున్నారు. దీపాలను వెలిగించడం ద్వారా మనిషిలోని అజ్ఞానమనే చీకటి తొలగి జ్ఞానదీపం వెలుగుతుందని ఆలయ అర్చకులు సురేశ్ వివరిస్తున్నారు.
ఎములాడలో నెల రోజులూ వేడుకలు
ఆలయాల్లో భక్తుల సందడి
ఆకట్టుకునే ఆకృతులలో దీపాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
