 
															అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లో ఈనెల 13న తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్ప డిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ప్రధాన నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిందితుడిని అరెస్ట్ చూపారు. ధరూర్‌లో ఈనెల 13న తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను మహారాష్ట్ర అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను మహారాష్ట్రకు పంపించి ఇటీవలే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనలో ప్రధాన నిందితుడైన మహారాష్ట్రలోని ఇంగోలి జిల్లా బాస్మతి తాలూకా కార్ఖాన్ గ్రామానికి చెందిన మారుకూలి అనిల్‌ను చల్‌గల్ శివారులో అరెస్ట్ చేశారు. అతడి నుంచి 24.5 గ్రాముల బంగారం, రూ.19 వేలు, షిఫ్ట్ కారు, రెండు మొబైల్ ఫోన్లు, మూడు ఫేస్‌మాస్క్‌లు, గ్లౌస్‌లు, స్క్రూడ్రైవర్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై సదాకర్, మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్‌ను డీఎస్పీ అభినందించారు.
24.5 గ్రాముల బంగారం
రూ.19 వేల నగదు, డిజైర్ కారు స్వాదీనం
డీఎస్పీ రఘుచందర్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
