 
															రైస్‌మిల్లులో పేలిన బాయిలర్
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని కనుకదుర్గా రైస్‌మిల్లులో బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బాయిలర్ పేలి ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. మిల్లు షెడ్ ధ్వంసమైంది. మిల్లు యాజమాని, కూలీలు కథనం ప్రకారం.. ధాన్యాన్ని పోస్తున్న క్రమంలో ప్రమాదశాత్తు బాయిలర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి యంత్రపరికరాలు ధ్వంసమయ్యాయి. షెడ్డు కుప్పకూలింది. అక్కడ పనిచేస్తున్న కూలీలు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మార్కెండేయకాలనికి చెందిన గంగరాపు కుమార్, శాసీ్త్రనగర్‌కు చెందిన రామస్వామికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే కరీనంగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఘటనలో దాదాపు రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం వాటిల్లిందని యాజమాని వాపోయారు. ఎస్సై అశోక్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఘటనపై ఆరా తీశారు. ఏసీపీ కృష్ణకు ఫోన్‌చేసి ప్రమాదానికి గల కారాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కూలీలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఏఐటీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీ కడారి సునీల్, మండల కన్వీనగర్ తాండ్ర అంజయ్య డిమాండ్ చేశారు.
ఇద్దరు కూలీలకు గాయాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
