 
															రాచపల్లిలో దొంగల హల్‌చల్
ఇల్లందకుంట: మండలంలోని రాచపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జెడ్పీహెచ్‌ఎస్‌లో బీరువా తాళం, రెండు క్లాస్‌రూం గదుల తాళం పాక్షికంగా ధ్వంసం చేశారు. బార్బర్ షాప్, టిఫిన్‌సెంటర్, సాయికృష్ణకు చెందిన కిరాణాషాపులో దొంగతనం చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై క్రాంతికుమార్ సంఘటన తీరును పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు చేసుస్తున్నామని తెలిపారు. నగదు, విలువైన ఆభరణాలు దొంగిలించలేదని, లోకల్ దొంగల పనేనని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
