వృద్ధురాలి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి ఆత్మహత్య

Oct 29 2025 7:31 AM | Updated on Oct 29 2025 7:31 AM

వృద్ధ

వృద్ధురాలి ఆత్మహత్య

వృద్ధురాలి ఆత్మహత్య అంగన్‌వాడీలోకి కొండచిలువ

మంథని: మంథనిలోని కూరగాయల మార్కెట్‌ రోడ్డులో నివాసముండే సిరిపురం వీరలక్ష్మీ(84) అనారోగ్యంతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంథని ఎస్‌ఐ– 2 సాగర్‌ వివరాల ప్రకారం.. మంథనికి చెందిన సిరిపురం వీరశంకర్‌ నారాయణ తల్లి వీరలక్ష్మి పదేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. కరీంనగర్‌, హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. నడవలేని స్థితిలో ఉండడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం వేకువజామున ఇంట్లో ఉన్న పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

పురుగుల మందుతాగి..

ధర్మారం: ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామానికి చెందిన సొన్నాయిల వెంకటరాజం(67) జీవితంపై విరక్తి చెంది సోమవారం పురుగులమందు తాగాడు. చికిత్స పొందుతూ మరణించినట్లు ధర్మారం ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన కథన ప్రకారం.. గుడుంబాకు బానిసైన వెంకటరాజం ఆరోగ్యం పూర్తి క్షీణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మందులు వాడుతున్నప్పటికీ నయం కాకపోవటంతో జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించగా. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

మనస్తాపంతో వైద్యుడు..

కరీంనగర్‌క్రైం: తన పేరు మీద పలువురు లోన్‌లు తీసుకొని తిరిగి చెల్లించక ఇబ్బందులు పెడుతున్నారని మనస్తాపంతో ఒక వైద్యుడు ఇంజక్షన్‌ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం మంకమ్మతోటకు చెందిన ఎంపటి శ్రీనివాస్‌ ప్రతిమ మెడికల్‌ ఆసుపత్రితో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తన స్నేహితులు కరుణాకర్‌, కుమారస్వామి తన వద్ద కొంతమొత్తం అప్పుగా తీసుకోగా.. కిరణ్‌, నరహరి అతని పేరు మీద లోన్‌ తీసుకున్నాడు. వీరంతా తిరిగి అప్పు, బ్యాంకులోన్‌లు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో తీవ్రమనస్తాపం చెందిన శ్రీనివాస్‌ సోమవారం రాత్రి ఇంజక్షన్‌ తీసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. ఈ విషయంపై మృతుడి భార్య ప్రభుత్వ వైద్యురాలు విప్లవశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ సృజన్‌రెడ్డి పేర్కొన్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.

కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలోకి కొండచిలువ వెళ్లే ప్రయత్నం చేయగా, గ్రామస్తులు పట్టుకుని ఊరుచివర వదిలేశారు. గ్రామంలోని ఒకటో అంగన్‌వాడీ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కొండచిలువ కేంద్రంలోకి వెళ్తుండగా, గ్రామస్తులు గమనించి చంద్రంపేటకు చెందిన అల్లె రాజుకు ఫోన్‌లో సమాచారం అందించారు. అతడు కొండచిలువను గుట్టల వద్ద వదిలిపెట్టారు.

వృద్ధురాలి ఆత్మహత్య1
1/2

వృద్ధురాలి ఆత్మహత్య

వృద్ధురాలి ఆత్మహత్య2
2/2

వృద్ధురాలి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement