 
															పతి భిక్ష పెట్టండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలస కూలీ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. మూడునెలలుగా కోమాలోనే ఉండగా.. కంపెనీ యాజమాన్యం దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసి చికిత్స అందించింది. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో స్వగ్రామానికి పంపిస్తున్నారు. కాగా, తన భర్తకు చికిత్స అందించేందుకు దాతల సాయం కోరుతోంది ఆ ఇల్లాలు. వివరాలు.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బాలమహేందర్ బతుకుదెరువు కోసం దుబాయ్ దేశంలోని మెటాక్ జనరల్ కంపెనీలో లేబర్ వీసాపై వెళ్లాడు. అక్కడే అనారోగ్యానికి గురయ్యాడు. మూడునెలలుగా కోమాలోనే ఉన్న బాలమహేందర్‌కు కంపెనీ యాజమాన్యం చికిత్స చేయించింది. అతడి ఆరోగ్య పరిస్థితి అలాగే ఉండడంతో బుధవారం స్వగ్రామానికి పంపిస్తున్నారు. బాలమహేందర్ తండ్రి 16 నెలల క్రితం పక్షవాతం బారిన పడి 8 నెలల క్రితం మృతిచెందాడు.
ఆర్థికసాయం అందించండి
మూడు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తన భర్తను కాపాడాలని బాలసంధ్య వేడుకుంటుంది. అసలే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉన్నాయని దాతలు స్పందించి ఆర్థికసాయం ఆదుకోవాలని బాలసంధ్య కోరుతుంది. బుధవారం దుబాయ్ నుంచి వస్తున్న భర్తను తీసుకొచ్చేందుకు రూ.40వేలు అప్పు చేసి అంబులెన్స్ ఏర్పాటు చేసుకున్నామని, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తామని తెలిపింది. దాతలు 96400 48582, 95731 18869 ఫోన్‌పే లేదా గూగుల్ పేలో ఆర్థికసాయం చేయాలని వేడుకుంది.
● దుబాయ్ ఆస్పత్రిలో కోమాలో వలసకూలీ
● నేడు స్వగ్రామానికి తీసుకొస్తున్న వైనం
● చికిత్సకు దాతలు సాయం చేయాలని వేడుకుంటున్న భార్య
 
							పతి భిక్ష పెట్టండి
 
							పతి భిక్ష పెట్టండి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
