ఏసీపీ ఫేస్‌బుక్‌ హ్యాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీపీ ఫేస్‌బుక్‌ హ్యాక్‌

Oct 29 2025 7:31 AM | Updated on Oct 29 2025 7:31 AM

ఏసీపీ ఫేస్‌బుక్‌ హ్యాక్‌

ఏసీపీ ఫేస్‌బుక్‌ హ్యాక్‌

గోదావరిఖని: ఏసీపీ ఫేస్‌బుక్‌ను సైబర్‌నేరగాళ్లు హాక్‌ చేశారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్‌ ఫేస్‌బు క్‌ను హాక్‌ చేసి సీఆర్‌పీఎఫ్‌ అధికారి రిటైర్డ్‌ అయ్యాడని అతని ఫర్నిచర్‌ విక్రయించడానికి సిద్ధంగా ఉందని అందుకోసం రూ.లక్ష చెల్లించాలని కోరుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసారు. అప్రమత్తమైన ఏసీపీ రమేశ్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపేరుతో వచ్చేఫేస్‌బుక్‌ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించ వద్దని కోరారు.

ఆలిండియా ఆర్చరీలో చికితకు స్వర్ణం

ఎలిగేడు: పంజాబ్‌ రాష్ట్రంలోని చంఢీఘడ్‌ భాటిండాల్‌లో ఈనెల 25,26 తేదీల్లో జరిగిన ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిని తానిపర్తి చికిత స్వర్ణం, కాంస్య పతకాలు సాధించింది. కాంపౌండ్‌ ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో చికిత– ప్రథమేశ్‌ టైబ్రేకర్‌లో విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నారు. ఉమెన్స్‌ టీం ఈవెంట్‌లోనూ చికిత కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది.

4వరకు పరీక్ష ఫీజు గడువు

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): శాతవాహన విశ్వవిద్యాలయం బీఎస్సీ హానర్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 1, 2, 3వ సెమిస్టర్‌, బయో మెడికల్‌ సైన్స్‌ కోర్సుల్లో 1, 3వ సెమిస్టర్‌ పరీక్షల ఫీజును నవంబర్‌ 4వ తేదీలోపు చెల్లించాలని శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్‌ తెలిపారు. పరీక్షలు నవంబర్‌లో జరుగుతాయని రూ.300 అపరాధ రుసుముతో నవంబర్‌ 10లోపు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

దరఖాస్తు గడువు పెంపు

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లిలోని కరీంనగర్‌ వైద్య కళాశాలలో పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువును నవంబర్‌ 27వ తేదీ వరకు పెంచినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తఖీయుద్దీన్‌ ఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ పారా మెడికల్‌ బోర్డు కార్యదర్శి నోటిఫికేషన్‌ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల కోర్సులైన డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌ (డీఎంఐటీ), డిప్లామా ఇన్‌ అనస్తీషియా టెక్నీషియన్‌ (డీఏఎన్‌ఎస్‌)లో చేరడానికి ఇంటర్మీడియట్‌ బైపీసీ, ఎంపీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్‌ వివరాల కోసం కళాశాల వెబ్‌సైట్‌, లేదంటే తెలంగాణ పారా మెడికల్‌ బోర్డు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement