 
															ఎదురెదురుగా ఢీకొన్న కారు.. ఆటో
చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల–కట్టలింగంపేట గ్రామాల మధ్య ఎదురెదురుగా కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, వృద్ధురాలికి తీవ్ర, మరో 14 మందికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మూడు కుటుంబాల వారు 15 మంది ఆటోను అద్దెకు తీసుకుని సోమవారం తెల్లవారుజామున యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి, భువనగిరిలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారల దర్శనం అనంతరం సోమవారం రాత్రి తిరుగుపయనమయ్యారు. ఈక్రమంలో మంగళవారం వేకువజామున చందుర్తి మండలం మల్యాల, కట్టలింగంపేట గ్రామాల మధ్య వీరు ప్రయాణిస్తున్న ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ టో డ్రైవర్ రాజు, వృద్ధురాలు లక్ష్మీనర్సవ్వకు తీవ్రగాయాలయ్యా యి. ఆటోలో ఉ న్న మిగతావారు స్వల్పగాయాలతో బయట పడ్డా రు. క్షతగాత్రులను 108లో వే ములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రిలో ఉంచుకోగా, స్వల్పగాయాలు అయినవారికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
డ్రైవర్, వృద్ధురాలికి తీవ్ర.. 14 మందికి స్వల్పగాయాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
