రౌడీషీటర్ల కదలికపై నిఘా
● నేరసమీక్షలో సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, వరుసగా నేరాలు చేస్తే కఠినచర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్‌లో శనివారం నేరసమీక్ష నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న పిటిషన్లను తర్వగా పరిష్కరించాలన్నారు. సీఐలు క్షేత్రస్థాయిలో ఠాణాలను సందర్శించాలన్నారు. ఎస్‌హెచ్‌వోలు స్టేషన్ పరిసరాలను పరి శుభ్రంగా ఉండేలా చూడాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. మాదక ద్రవ్యాలు, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవా ణా, పేకాటస్థావరాలపై దాడులు చేయాలన్నారు. గంజాయి నిర్మూలనకు పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ (పరిపాలన), భీంరావు (ఏఆర్), ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, మాధవి, శ్రీనివాస్, శ్రీనివాస్‌జి, వేణుగోపాల్, విజయకుమార్, వాసాల సతీశ్ పాల్గొన్నారు.


