పోషక ఫలాల సాగు
రామగుండం: అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి లంబాడితండా సమీపంలో పదెకరాల్లో డ్రాగన్, బొ ప్పాయి, నిమ్మ, జామ, సీతాఫలం, అంజీరా, ఆవకాడో తదితర పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. పందెంకోళ్లు, నాటుకోళ్ల పెంపకం కూడా చేపట్టాడు మంచిర్యాలకు చెందిన రైతు గూడ రాంరెడ్డి. నాలు గెకరాల్లో ఎనిమిదేళ్లుగా డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. రూ.6లక్షల వ్యయంతో పంట వేశాడు. ఎ రువు, పండ్ల కో తకు ఏటా రూ.1.50 లక్షలు వ్య యం చేస్తుంటాడు. గరిష్టంగా 60 క్వింటాళ్ల దిగుబ డి వస్తుందని, మార్కెట్‌లో రూ.వంద వరకు ధర పలికితే మూడింతల లాభం వస్తుందని రాంరెడ్డి తె లిపాడు. మూడేళ్ల నుంచి బొప్పాయి సాగు ప్రారంభించాడు. ఎకరా విస్తీర్ణంలో వెయ్యి మొక్కలు నాట గా, ఎరువులు, ఇతరత్రా పనులకు రూ.2లక్షలు వె చ్చించాడు. దాదాపు 500 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెట్‌లో కేజీకి రూ.20 పలికినా లాభాలు పొందవచ్చని వివరించాడు.
కూలీలు దొరకడం లేదు
మాది వ్యవసాయ కుటుంబం. మంచిర్యాలలో వ్యాపారాలున్నాయి. ఇక్కడ ప దేళ్ల క్రితమే పదెకరాలు కొని తొ లుత మిర్చి, ఇతరత్రా కూరగా యలు సాగు చేశా. కూలీల కొరతతో సాగు రకాలు తగ్గించా. రోజూ తోటలు పర్యవేక్షిస్తున్న.
– గూడ రాంరెడ్డి, రైతు, బ్రాహ్మణపల్లి
పోషక ఫలాల సాగు


