స్వదేశానికి చేరుకున్న జోర్డన్ బాధితుడు
జగిత్యాలక్రైం: బతుకుదెరువు కోసం జోర్డన్ వెళ్లిన ఓ కూలి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు జోక్యంతో స్వదేశానికి చేరాడు. జగిత్యాల పట్టణంలోని నాగేంద్రనగర్‌కు చెందిన అబ్బనవేని నర్సింహులు 11 నెలల క్రితం జీవనోపాధి కోసం జోర్డన్ వెళ్లాడు. అక్కడ పనిలేకపోవడం.. చాలీచాలని వేతనాలు ఇవ్వడంతోపాటు కంపెనీ తీవ్ర ఇబ్బంది పెట్టింది. ఇలా 12 మంది పడుతున్న ఇబ్బందులను వీడియోలు తీసి కుటుంబసభ్యులకు పంపించారు. స్పందించిన హరీశ్‌రావు కంపెనీ పెనాల్టీతోపాటు, రవాణా ఖర్చులు భరించి బాధితులను స్వదేశానికి రప్పించారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా.. హరీశ్‌రావు స్వగ్రామానికి రప్పించండం ఆనందగా ఉందని బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు.
మాజీమంత్రి హరీశ్‌రావు జోక్యంతో..


