రత్నచూడి విత్తనంతో రోగ నిరోధక శక్తి
మల్యాల(చొప్పదండి): వ్యాధుల బారిన పడకుండా దోహదపడే రోగ నిరోధకశక్తి ప్రాధాన్యత గుర్తించి మల్యాల మండలం మానాల గ్రామంలో రైతు రత్నచూడి విత్తనం సాగు చేస్తున్నాడు. పూర్వం రాజులు తినే ఆహారంగా పేరుపొందిన రత్నచూడి విత్తనంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, తన సన్నిహితుల ద్వారా తెలుసుకున్న మానాల గ్రామానికి చెందిన రైతు ఎడిపెల్లి మల్లయ్య ఎకరం పొలం సాగు చేశాడు. ప్రయోగాత్మకంగా తన కుటుంబం కోసం రత్నచూడి సాగు చేస్తున్నానని, పెట్టుబడి కూడా తక్కువ అయొందని తెలిపాడు. ఈ పంట బియ్యం సన్నగా, తియ్యగా ఉంటాయని వివరించాడు.


