ఉల్లి, పుదీనా..
బోయినపల్లి(చొప్పదండి): ఉ ల్లి, పుదీనా సాగుచేస్తూ రైతు లాభాలు గడిస్తున్నాడు. నీలోజిపల్లికి చెందిన సింగిరెడ్డి బాలమల్లు 15 గుంటల్లో పుదీనా, మరో 5 గుంటల్లో ఉల్లి సాగు చే స్తున్నాడు. పుదీనా ఒక్కసారి నాటితే రెండేళ్ల వరకు దిగుబడి వస్తుంది. 20 గుంటల్లో వేసిన పుదీనాకు రూ.15వేలు పెట్టుబడి పెడితే రూ.లక్ష వరకు దిగుబడి వ స్తుంది. పుదీనా ఒక కటింగ్‌కు 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, సుమారు 50 సార్లు కోతకు వస్తుందని, క్వింటాల్‌కు రూ.600–రూ.800 ధర పలుకుతుందని వివరించాడు. నెలరోజుల్లో చేతికి వచ్చే పంట ఉల్లిని రూ.వెయ్యి పెట్టుబడితో 5 గుంటల్లో సాగుచేస్తే 10 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని.. రూ.10వేల వరకు దిగుబడి వస్తుందన్నాడు.
ఉల్లి, పుదీనా..


