ట్రాన్స్‌కో ఉద్యోగి డ్రాగన్ బాట
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన కాటం వానారెడ్డి ట్రాన్స్‌కోలో ఉద్యోగం చేస్తూ ఎకరం భూమిలో డ్రాగన్‌ప్రూట్ సాగు చేశాడు. పంటమార్పిడి చేయాలన్న ఆలోచనతో అనుభవం లేకున్నా వరికి బదులు డ్రాగన్‌ప్రూట్ వేశాడు. నెల క్రితం మొదటి పంట చేతికి రాగా, 5 క్వింటాళ్ల వరకు గ్రామంలో కిలోకు రూ.100 నుంచి రూ.150 విక్రయించినట్లు తెలిపాడు. కాగా వరిసాగు చేసే ప్రాంతంలో వానారెడ్డి డ్రాగన్‌ఫ్రూట్ వేసినట్లు తెలుసుకున్న ఇతర గ్రామాల యువ రైతులు ఇటీవల డ్రాగన్ పంటను సందర్శించారు.
రిటైర్డ్ కార్మికుడు.. వినూత్న ఆలోచనలు
రామగిరి(మంథని): బొగ్గు గనిలో కార్మికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టంలేక సాగుపై దృష్టి సారించాడు కల్వచర్ల గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వర్లు. అయితే, సంప్రదాయ పంటలు కాకుండా వినూత్నంగా ఆలోచన చేశాడు. తనకు లాభాలు, ప్రజలకు ఆరోగ్యం తెచ్చిపెట్టే డ్రాగన్ ప్రూట్ సాగుచేయాలని నిర్ణయించాడు. దీంతో ఈ పంట సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతంలో అల్లం సాగు చేయగా లాభాలు అంతగారాలేదని, తనకున్న ఎకరన్నరలో డ్రాగన్‌ప్రూట్ పండిస్తున్నాడు.
ఇల్లంతకుంట(మానకొండూర్): పంటల సాగులో వైవిద్యం చూపుతున్నారు ఇల్లంతకుంట మండలం దాచారం, రేపాక గ్రామాల రైతులు. దాచారం గ్రామానికి చెందిన కొండం రాజిరెడ్డి ఐదెకరాల్లో 2021లో డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేశాడు. ఎకరాకు రూ.6లక్షల వరకు ఖర్చయింది. నిర్వహణకు ఏటా రూ.50వేలు ఖర్చు అవుతుందని.. రెండేళ్లకు పంట రావడం ప్రారంభించిందని తెలిపారు. ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. గతేడాది కిలోకు రూ.185, ప్రస్తుతం రూ.100 ధర పలుకుతుందని తెలిపారు. డ్రాగన్‌ఫ్రూట్ పంటను హైదరాబాద్‌లోని బాటసింగారం పండ్ల మార్కెట్‌కు తరలిస్తున్నట్లు వివరించాడు. రాజిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని రేపాకకు చెందిన రోడ్ల రాజేందర్‌రెడ్డి ఎకరం భూమిలో డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నాడు.
ట్రాన్స్‌కో ఉద్యోగి డ్రాగన్ బాట
ట్రాన్స్‌కో ఉద్యోగి డ్రాగన్ బాట
ట్రాన్స్‌కో ఉద్యోగి డ్రాగన్ బాట
ట్రాన్స్‌కో ఉద్యోగి డ్రాగన్ బాట


