ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల లక్షా మరెడ్డి(64) అనే రైతు ఉరివేసుకొని శనివారం సాయంత్రం మృతిచెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బా ధపడుతున్న రైతు.. మనస్తా పంతో పొలం సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేశారు.
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి..
శంకరపట్నం: ఏరడపల్లి గ్రామంలో శనివారం రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కనకం రాజయ్య(67) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్య.. ఫోన్‌ద్వారా తన కుమారులు, మనుమలతో మాట్లాడారు. తన ఇంటికి రావాలని కోరాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బావిలో దూకి వృద్ధురాలు..
సారంగాపూర్: మండలంలోని పెంబట్లకు చెందిన గాజెంగి జమున (60) శనివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గీత కథనం ప్రకారం..జమున భర్త రాజేశం పదేళ్ల క్రితం మృతిచెందాడు. బీడీలు చుడుతూ వచ్చిన సొమ్ముతో పెద్ద కూతురుకు పెళ్లి జరిపించింది. కూతురుకు విడాకులు కావడంతో మనోవేధనకు గురవుతోంది. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడింది. మనస్తాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. జమున కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో..
సిరిసిల్ల అర్బన్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి శనివారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ అహ్మద్(57) పెద్దూరులోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఉంటున్నారు. ఇటీవల అహ్మద్ కాలుకు తీవ్ర గాయమైంది. అది నయంకాకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈక్రమంలోనే ఇంట్లోని కిటికికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య కాపురానికి రావడం లేదని..
గోదావరిఖని: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో నగరంలోని మార్కండేయ కాలనీకి చెందిన గంధం రాంకీ(29) క్రిమిసంహాక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. రెండున్నరేళ్లుగా భార్యతో కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలో ఈనెల 20న క్రిమిసంహారక మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా శుక్రవారం రాత్రి మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య


